Tirupati: తిరుపతిలో ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం!
Tirupati: తిరుపతిలో అప్పుస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవానికి తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరయ్యారు.
Tirupati: తిరుపతిలో ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం!
Tirupati: విద్యార్థులను క్రమశిక్షణతో తీర్చిదిద్ది, ఉత్తమ పౌరులుగా మలచడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్-ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (అప్పుస్మా) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రక్తసంబంధం లేకపోయినా విద్యార్థులను కన్నబిడ్డల్లా భావించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని అన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఉన్నత ఆలోచనలు, లక్ష్యాలను పెంపొందించి సమాజానికి మంచి పౌరులుగా అందిస్తున్నారని కొనియాడారు.
దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో మహిళలు, బాలికలు ప్రతిభ చాటుతున్నారని వారిలో ఆత్మవిశ్వాసం, సంస్కారం పెంపొందించడంలో ఉపాధ్యాయుల బోధన కీలకమని పేర్కొన్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంగానే కాకుండా ప్రముఖ విద్యా కేంద్రంగా కూడా గుర్తింపు పొందిందన్నారు. నాణ్యమైన విద్య కోసం ఇతర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు తిరుపతికి వస్తున్నారని తెలిపారు.
విద్యా రంగానికి, పాఠశాలలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవసరమైన సహకారాన్ని తనవంతుగా అందిస్తామని దివాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులను అభినందించారు.కార్యక్రమానికి ఎమ్మెల్యేలు పులివర్తి నాని,ఆరణి శ్రీనివాసులు,కలికిరి మురళీమోహన్,ఏపీ గ్రీనరీ బ్యూటిఫికేషన్ ఛైర్మన్ సుగుణమ్మ, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. డీఈవో కేవీవీ కుమార్, అప్పుస్మా నేతలు తులసి విష్ణు ప్రసాద్, డాక్టర్ విశ్వనాథ రెడ్డి, డాక్టర్ తమ్మినేని వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.




