Srikalahasti: మే 17న తిరుపతిలో రాజకీయ వేడి పెంచనున్న సదస్సు
Srikalahasti: తిరుపతి బైరాగపట్టెడలో ఈ నెల 17న జరగబోయే 'భారత రాజ్యాంగం-సవాళ్లు' సదస్సును జయప్రదం చేయాలని భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది.
Srikalahasti: మే 17న తిరుపతిలో రాజకీయ వేడి పెంచనున్న సదస్సు
శ్రీకాళహస్తి: ఈ నెల 17వ తేదీన తిరుపతి బైరాగ పట్టెడలో జరిగే 'భారత రాజ్యాంగం-సవాళ్లు' సదస్సును జయప్రదం చేయాలని భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి సభ్యులు పిలుపునిచ్చారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో శుక్రవారం 'భారత రాజ్యాంగం-సవాళ్లు' కరపత్రాలను ఆవిష్కరించారు. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో నానాటికి భారత రాజ్యాంగం ప్రమాదంలో పడుతోందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ ప్రస్తుతం భారత రాజ్యాంగానికి ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కారాలను సదస్సు ద్వారా విశ్లేషిస్తారనీ, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గంధం మణి, పెనగడం గురవయ్య, వెంకటేష్, గురునాధం, రాజా, అన్వర్ బాషా, ఉస్మాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Next Story




