Renigunta: బిస్మిల్లా నగర్ పార్క్‌కు మహర్దశ: వేగంగా అభివృద్ధి, సుందరీకరణ పనులు!
Renigunta: ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలతో జరుగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులను ఎంపీడీవో రవిచంద్ర, ఈవో శ్రీధర్ పరిశీలించారు.
Renigunta: బిస్మిల్లా నగర్ పార్క్‌కు మహర్దశ: వేగంగా అభివృద్ధి, సుందరీకరణ పనులు!
రేణిగుంట: రేణిగుంట పట్టణంలోని బిస్మిల్లా పార్క్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను వేగవంతం చేస్తున్నట్లు ఎంపీడీవో రవిచంద్ర తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్కును ప్రజలకు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.
సోమవారం పార్కులో జరుగుతున్న పనులను ఎంపీడీవో రవిచంద్ర, పంచాయతీ ఈవో శ్రీధర్ పరిశీలించారు. పిచ్చిమొక్కలు, వ్యర్థాలను తొలగించి పార్కును పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సుందరీకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పచ్చదనం పెంపొందించడం, నడక మార్గాలు, పిల్లలు, మహిళలు, వృద్ధులకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
పూర్వ వైభవం తీసుకొస్తాం:
టీడీపీ రేణిగుంట పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బిస్మిల్లా పార్క్‌ను గతంలో మాదిరిగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు సహకరిస్తానన్నారు. పనుల నాణ్యతపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, త్వరలోనే పార్కును ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.




