Srikalahasti: శ్రీకాళహస్తిలో ఘనంగా అంగన్ కా ఉత్సవ్!
Srikalahasti: శ్రీకాళహస్తిలో నిర్వహించిన అంగన్ కా ఉత్సవ్‌లో అంగన్వాడీ కార్యకర్తలను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఘనంగా సన్మానించారు.
Srikalahasti: శ్రీకాళహస్తిలో ఘనంగా అంగన్ కా ఉత్సవ్!
Srikalahasti: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని చేపడుతున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మ గుడి ఫంక్షన్ హాల్‌లో “అంగన్ కా ఉత్సవ్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తల సేవలను గుర్తిస్తూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రీకాళహస్తి అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్ వారిని ఘనంగా సన్మానించారు. పట్టుచీరలు, పసుపు కుంకుమ, చీర–జాకెట్, పూల గాజులు అందజేసి అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవం తెలిపారు.
ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కార్యకర్తల సేవలకు సెల్యూట్ చేస్తున్నామని అన్నారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్య, సమగ్ర అభివృద్ధిలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలు బలమైన పునాదిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
సమాజానికి అంగన్వాడీ కార్యకర్తలు అందిస్తున్న నిస్వార్థ సేవలను ఆయన అభినందించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, అభివృద్ధి కోసం వారు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు, అసెంబ్లీ కో-కన్వీనర్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, పట్టణ అధ్యక్షులు రాఘవనాయుడుకుప్పం హరీష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కండ్రిగ ఉమా, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రజ్ఞాశ్రీ, ఉపాధ్యక్షురాలు రామ్ ఉమా సింగ్, రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జీవీ అమర్నాథ్, కోనేటి అయ్యప్ప, ఐసీడీఎస్ సీడీపీవో శాంతి దుర్గా, సూపర్‌వైజర్లు భాగ్యలక్ష్మి, మరియమ్మతో పాటు చోటు, ధనుష్, సజ్జ హరీష్, తులసి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.




