Srikalahasti: శ్రీకాళహస్తిలో బీజేపీ సేవా సంకల్ప్ అభియాన్ సన్నాహక సమావేశం!

Srikalahasti: శ్రీకాళహస్తి బీజేపీ కార్యాలయంలో సేవా సంకల్ప్ అభియాన్ సన్నాహక సమావేశం. సెప్టెంబరు 17 నుంచి నెల రోజుల పాటు నిర్వహించనున్నట్లు నాయకుల వెల్లడి.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 15 Sept 2026 12:55 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తిలో బీజేపీ సేవా సంకల్ప్ అభియాన్ సన్నాహక సమావేశం!

Srikalahasti: సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 17వ తేదీ వరకు నిర్వహించనున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించి శ్రీకాళహస్తి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ నాయకులు మాట్లాడుతూ నెల రోజుల పాటు నిర్వహించనున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ‘ఆశీర్వాద కా దియా’, ‘నమో సేవా గాథ’, ‘సేవా జ్యోతి యాత్ర’ వంటి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

క్షేత్రస్థాయిలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే విధంగా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మండల అధ్యక్షులు, ఇన్‌చార్జిలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI