Tirupati: చెరుకువారిపల్లిలో వైసీపీకి షాక్!

Tirupati: చంద్రగిరి నియోజకవర్గం చెరుకువారిపల్లిలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఐదుగురు వైసీపీ నాయకులు ఎమ్మెల్యే పులివర్తి నాని సమక్షంలో టీడీపీలో చేరారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 16 Nov 2026 8:09 AM IST
Tirupati
X

Tirupati: చెరుకువారిపల్లిలో వైసీపీకి షాక్!

Tirupati: చంద్రగిరి నియోజకవర్గం యర్రావారిపాలెం మండలం చెరుకువారిపల్లి పంచాయతీలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీకి చెందిన ఐదుగురు నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ప్రతిపక్ష నాయకులు టీడీపీలో చేరుతున్నారని ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేసి సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులను ఘన విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL