Srikalahasti: వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి!

Srikalahasti: వైఎస్ఆర్సీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 1 Oct 2026 10:59 AM IST
Srikalahasti
X

Srikalahasti: వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి!

Srikalahasti: అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ప్రజా సమస్యలను ప్రస్తావించని వైఎస్ఆర్‌సీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు.

ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ అసెంబ్లీకి హాజరుకాకపోవడం సరికాదని ఆయన అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.

పాఠశాల విద్యార్థులు తరగతులకు హాజరుకాకపోతే వారిపై చర్యలు తీసుకుంటారని, అదే విధంగా ప్రజల నుంచి ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా విధులకు దూరంగా ఉంటే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని సుధీర్ రెడ్డి అన్నారు.

ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా గైర్హాజరవుతున్న ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకుని, అవసరమైతే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI