Srikalahasti: శ్రీకాళహస్తిలో భక్తి పారవశ్యం స్వామివారి సేవలో ప్రముఖులు

Srikalahasti: శ్రీకాళహస్తి ఆలయంలో అమావాస్య సందర్భంగా శ్రీ శనీశ్వర స్వామి వారికి ప్రత్యేక తైలాభిషేకం నిర్వహించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 16 May 2026 4:10 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తిలో భక్తి పారవశ్యం స్వామివారి సేవలో ప్రముఖులు

శ్రీకాళహస్తి: అమావాస్య సందర్భంగా శ్రీ శనీశ్వర స్వామి ప్రత్యేక తైలాభిషేకంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ శనీశ్వర స్వామి ప్రత్యేక తైలాభిషేకంలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఎమ్మెల్యే దంపతులకు అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు.

ఆలయ EO BK వెంకటేశులు ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు గుర్రప్ప శెట్టి, గోపీనాథ్, బీలా స్రవంతి పాల్గొన్నారు. ఆలయ AEO విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ AEO మోహన్, పర్యవేక్షకులు నాగభూషణం, ఇన్స్పెక్టర్ వెంకటస్వామి హాజరయ్యారు. అర్చకులు, వేద పండితులు, స్థానిక TDP నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story