Tirupati: ఓజిలిలో పట్టపగలే భారీ చోరీ: 48 సవర్ల బంగారం మాయం!
Tirupati: ఓజిలిలో పట్టపగలే కిరాణా వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి బీరువాలోని 48 సవర్ల బంగారాన్ని దోచుకెళ్లిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Tirupati: ఓజిలిలో పట్టపగలే భారీ చోరీ: 48 సవర్ల బంగారం మాయం!
తిరుపతి: తిరుపతి జిల్లా ఓజిలి మండలంలోని ఓజిలి గ్రామంలో హెచ్.పీ గ్యాస్ గోడౌన్ పక్కన చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్న మురళి,రేవతి వారి కుమారుడు నవీన్ లు, ఈరోజు మురళి రేవతి కిరాణా కొట్టు సామాన్లు నిమిత్తం ఉదయం నాయుడుపేటకు వెళ్లి మధ్యాహ్నం 1:45 గంటల సమయంలో ఇంటికి రాగా తలుపులు పగలగొట్టి బీరువాలోని వస్తువులు మంచం మీద చిందర వందర గా పడుండడంతో ఆందోళన చెందిన వారు బీరువాను తనిఖీ చేయగా 48 సవరణ బంగారం కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ దర్యాప్తులోనే భాగంగా మురళి రేవతి ఇలా గృహాన్ని క్లూస్ టీం తనిఖీ చేయడం జరిగింది, దొంగతనం ఎలా జరిగింది అని తెలుసుకోవడంలో క్లోజ్ టీం ఆధారాలను సేకరించింది, దొంగతనం కు సంబంధించిన సంఘటన స్థలాన్ని నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వర రావు పరిశీలించారు. ఈ దొంగతనం చేసిన దుండగులను అదుపులోకి తీసుకొని నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వర రావు తెలియజేయడం జరిగింది, ఈ సంఘటనలు భాగంగా ఓజిలి ఎస్సై శ్రీకాంత్ ఉన్నారు.




