Chandragiri: బుచ్చినాయుడుపల్లి మాతమ్మ తిరునాళ్లలో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి

Chandragiri: చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లి దళితవాడలో ఘనంగా జరిగిన మాతమ్మ తిరునాళ్లు. హాజరై మొక్కులు తీర్చుకున్న వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 16 Aug 2026 8:59 PM IST
Chandragiri
X

Chandragiri: బుచ్చినాయుడుపల్లి మాతమ్మ తిరునాళ్లలో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి

చంద్రగిరి: చంద్రగిరి మండలం బుచ్చినాయుడు పల్లి దళితవాడలో ఆదివారం జరిగిన మాతమ్మ తిరునాళ్లకు చంద్రగిరి నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి హాజరయ్యారు. గ్రామస్తులు ఆయనకు సాదర స్వాగతం పలికి అమ్మవారి దర్శనానికి తీసుకు వెళ్లారు.

మాతమ్మను దర్శించుకున్న చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గ్రామస్తులతో సరదాగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలుకరిస్తూ యోగ క్షేమాలు అడగి తెలుసుకున్నారు. మాతమ్మ తిరునాళ్లకు వచ్చిన వారంతా చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డితో సెల్ఫీలు తీసుకుని సందడి చేశారు.

అమ్మవారి తిరునాళ్ల ప్రాసస్థ్యం తెలుసుకున్న చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి గ్రామస్తులతో కొంత సమయం సరదాగా గడిపారు. వయోవృద్ధులు, చిన్న పిల్లలతో కలసిమెలసి సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, బుచ్చిబాబు, ఎన్‌.మనోహర్‌కుమార్, ఎం.వాసు, డి.మస్తాన్, ఎ.రాము తదితరులు పాల్గొన్నారు.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI

Next Story