Chandragiri: భార్యకు వీడియో కాల్ చేసి వ్యక్తి ఆత్మహత్య

Chandragiri: చంద్రగిరిలో తీవ్ర విషాదం. కుటుంబ కలహాలతో భార్యకు వీడియో కాల్ చేసి ఉరివేసుకొని తిరుపతికి చెందిన జగదీశ్ ఆత్మహత్య. కేసు నమోదు చేసిన పోలీసులు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 30 July 2026 2:57 PM IST
Chandragiri
X

Chandragiri: భార్యకు వీడియో కాల్ చేసి వ్యక్తి ఆత్మహత్య

చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి టౌన్‌లోని ఎంజీ బ్రదర్స్ ప్లాట్స్‌లో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. తిరుపతికి చెందిన జగదీశ్ (47) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

రంగంపేటలోని ఓ కళాశాలలో ఉద్యోగం చేస్తున్న జగదీశ్‌కు బుధవారం భార్యతో కుటుంబ కలహాలు జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం చంద్రగిరిలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిన ఆయన ఉరివేసుకునే ముందు భార్యకు వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు.

దీంతో అప్రమత్తమైన భార్య వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా, జగదీశ్ అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై విచారణ కొనసాగుతోంది.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story