Chandragiri: వైసీపీ దాడులు, తప్పుడు ప్రచారాన్ని ఖండించిన పులివర్తి నాని
Chandragiri: కుప్పం ఘటన, వైసీపీ హయాంలో దాడులు, తప్పుడు ప్రచారాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఖండించారు; ప్రజాస్వామ్య విలువలు కాపాడతామని స్పష్టం.
Chandragiri: వైసీపీ దాడులు, తప్పుడు ప్రచారాన్ని ఖండించిన పులివర్తి నాని
చంద్రగిరి: రాష్ట్రంలో వైసీపీ నాయకులు అధికారంలో ఉన్న సమయంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడిన ఘటనలు అనేకం. కుప్పం ప్రాంతంలో టీడీపీ కార్యకర్తపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఘటనపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదు. 2021 తిరుపతి ఉపఎన్నికలు, 2020 అంగళ్లలో, 2023 అంగళ్ల పర్యటన సమయంలో జరిగిన దాడులు వైసీపీ హయాంలో నెలకొన్న రాజకీయ హింసకు నిదర్శనం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బెదిరింపులు, దాడులు, అక్రమాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. అధికారులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష అభ్యర్థులపై ఒత్తిళ్లు తెచ్చి, నామినేషన్ల ఉపసంహరణకు ప్రయత్నించడం ప్రజాస్వామ్య విరుద్ధం.
ప్రజల మద్దతు లేని వైసీపీ నాయకులు రాజకీయ హింస, తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, ప్రజల హక్కుల కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాడుతుంది. మీ పులివర్తి నాని ఎమ్మెల్యే, చంద్రగిరి నియోజకవర్గం.




