Chandragiri: ముక్కోటి అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో నేడు చాగంటి ప్రవచనం!

Chandragiri: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ శ్రీ ముక్కోటి అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో నవంబర్ 27న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 26 Nov 2026 4:12 PM IST
Chandragiri
X

Chandragiri: ముక్కోటి అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో నేడు చాగంటి ప్రవచనం!

చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామంలోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 27వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు అని ఆలయ ధర్మకర్త మొగిలి ఇందుమౌళి రెడ్డి తెలిపారు

ముక్కోటి అగస్త్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరిగే ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాన్ని అందించనున్నారు. భక్తిభావాన్ని పెంపొందిస్తూ, ధర్మం, ఆధ్యాత్మికత, సనాతన సంప్రదాయాల విశిష్టతను వివరించే ఈ ప్రవచన కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించనుంది.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI