Tiruchanur: తిరుపతి రూరల్ జెడ్పీటీసీగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిని గెలిపించండి!

Tiruchanur: తిరుపతి రూరల్ తిరుచానూరులో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచారం. ఫ్యాను గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెవిరెడ్డి లక్ష్మీరెడ్డి పిలుపు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 31 Oct 2026 11:31 AM IST
Tiruchanur
X

Tiruchanur: తిరుపతి రూరల్ జెడ్పీటీసీగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిని గెలిపించండి!

Tiruchanur: తిరుచానూరు మేజర్ పంచాయతీలో వైయస్సార్సీపి జడ్పిటిసి అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్‌ రెడ్డిని, తిరుచానూరు ఎంపీటీసీ అభ్యర్థుల నుఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చెవిరెడ్డి లక్ష్మీరెడ్డి, తిరుచానూరు మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి సతీమణి మధు రెడ్డి పిలుపునిచ్చారు.

తిరుచానూరు పంచాయతీలో సమాజం వీధి, సన్నిది వీధి సుడిగాలి పర్యటన చేశారు.కరోనా వంటి కష్టం వచ్చినా.. వరదలు వంటి విపత్తులు వచ్చినా.. పండుగలు వచ్చినా.. పర్వదినాలు వచ్చినా.. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు అందరికీ గుర్తుకు వచ్చేది చెవిరెడ్డి కుటుంబం.

పాతికేళ్లుగా చంద్రగిరి రాజకీయాల్లో చెవిరెడ్డి మార్క్‌ అలాంటిది. కులం, మతం, పార్టీ, ప్రాంతం అన్న తేడాలు లేకుండా అందరికీ సాయం చేసే గుణమున్న చెవిరెడ్డి బిడ్డ తిరుపతి రూరల్‌ జడ్పీటీసీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాడు. చెవిరెడ్డి బిడ్డగానే కాకుండా.. ఒక విద్యార్థి నాయకుడుగా ఎందరో పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన మనసున్న వ్యక్తి.. విద్యారంగంలో సమస్యల పరిష్కారం కోరుతూ అనేక ఉధ్యమాలు చేసిన ఉధ్యమ నాయకుడు.

నేడు ప్రజాక్షేత్రంలోకి.. తొలిసారిగా అడుగు పెట్టాడు.. ప్రజలకు సేవ చేయడంలో తండ్రికి తగ్గ తనయునిగా.. గత ఐదేళ్ల జగనన్న ప్రభుత్వ పాలనలో గ్రామాలను ప్రగతి వైపు పరుగులు పెట్టించడంలో చెవిరెడ్డి హర్షిత్‌ రెడ్డి పాత్ర ఎంతో కీలకం.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు నరేష్ రెడ్డి, శేఖర్, మాజీ ఎంపీపీ యశోద, దూరవాసులు, చింతాలహరి, లోకేష్, మోహన్ రెడ్డి, వెంకటేష్, చంద్రశేఖర్ ఆజాద్, సునీల్ రెడ్డి, పుష్ప రెడ్డి ఆర్. ఆర్. యూత్ వైయస్సార్సీపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL