Srikalahasti: జనసేన ఎన్నికల కమిటీ సభ్యుడిగా చిన్నతోటి నాగరాజు!

Srikalahasti: శ్రీకాళహస్తి నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ సభ్యుడిగా రేణిగుంట జనసేన మండల అధ్యక్షుడు చిన్నతోటి నాగరాజు నియామకం.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 6 Sept 2026 4:32 PM IST
Srikalahasti
X

Srikalahasti: జనసేన ఎన్నికల కమిటీ సభ్యుడిగా చిన్నతోటి నాగరాజు!

శ్రీకాళహస్తి: తిరుపతి పార్లమెంట్ శ్రీకాళహస్తి నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ మెంబర్ గా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండల జనసేన పార్టీ అధ్యక్షుడు చిన్నతోటి నాగరాజుకు అవకాశం లభించింది.

తిరుపతి జిల్లా జనసేన పార్టీలో అతిరథ మహారధులు మధ్య శ్రీకాళహస్తి నియోజకవర్గం నుండి విద్యావంతుడు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి ఉన్నతమైన కుటుంబంలో పెరిగి మెగాస్టార్ కుటుంబం పై ప్రేమ అభిమానాలు కలిగి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదేశాలనుసారం

క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వర్తిస్తూన్న రేణిగుంట మండలాధ్యక్షుడు చిన్నతోటి నాగరాజు ను జనసేన పార్టీ అధిష్టానం ఎన్నుకోవడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story