Puttur: కనీస వేతనం రూ. 26 వేలకు పెంచాలని డిమాండ్!
Puttur: కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, అంగన్‌వాడీ, ఆశా కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలకు పెంచాలని జూలై 30న జరిగే ధర్నా పోస్టరును సిఐటియు నేతలు ఆవిష్కరించారు.
Puttur: కనీస వేతనం రూ. 26 వేలకు పెంచాలని డిమాండ్!
పుత్తూరు: కాంటాక్ట్ కార్మికులకు,ఔట్సోర్సింగ్ కార్మికులకు,అంగన్వాడి,ఆశ, మధ్యాహ్నం భోజనం కార్మికులకు కనీస వేతనం 26 వేలకు పెంచాలని జూలై 30వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నా పోస్టర్ను నేడు పుత్తూరులో సిఐటియు నేతలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి. సుబ్రహ్మణ్యం, సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్.వెంకటేష్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ప్రభుత్వాలు కార్మికులకు జీతాలు పెంచకపోవడం అన్యాయం అన్నారు.పెరిగిన ధరలతో కార్మికులు,చాలీచాలని జీతాలతో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అంగన్వాడి,ఆశ, మధ్యాహ్నం భోజనం కార్మికులకు జీతాలు పెంచకుండా పాలకులు హామీలతో మోసం చేస్తున్నారని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్మిక హక్కులను కాల రాయడం కోసమే లేబర్ కోడ్స్ తెచ్చారని విమర్శించారు. కార్మిక హక్కులను కాపాడుకోవడానికి కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు భద్రతలేదని, అనేక ప్రమాదాలు జరుగుతున్న తనిఖీలు నిర్వహించే అధికారులు నిద్రపోతున్నారని విమర్శించారు. కార్మిక సమస్యలపై సిఐటియు నిరంతర పోరాడుతుందని అన్నారు.
జూలై 30వ తేదీన కనీస వేతనాలు పెంపు కోసం,కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని జరుగుతున్న ధర్నాలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొవాలని విజ్ఞప్తి చేశారు.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సిఐటియు నేతలు విజయ్, రమేష్, శివ, దేవా రెడ్డి, భాష, శరవణ, హరిబాబు, ముని కుమారి, లలిత, కృష్ణవేణి, విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు.




