Tirupati: జాతరలో జగడం.. యువకుడిపై బీర్‌ బాటిల్‌తో దాడి భయాందోళనలో భక్తులు!

Tirupati: తిరుపతి జిల్లా రేణిగుంట జాతరలో ఘర్షణ చోటుచేసుకుంది. యువకుడిపై బీర్ బాటిల్‌తో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.

JALEEL, NAGARI & RENIGUNTA
Updated on: 19 Aug 2026 11:05 PM IST
Tirupati
X

Tirupati: జాతరలో జగడం.. యువకుడిపై బీర్‌ బాటిల్‌తో దాడి భయాందోళనలో భక్తులు!

తిరుపతి: జాతర సందడి వేళ రేణిగుంటలో ఘర్షణ చోటుచేసుకోవడం కలకలం రేపింది. వేణుగోపాలపురానికి చెందిన ఓ యువకుడిపై జ్యోతినగర్‌కు చెందిన కొందరు వ్యక్తులు బీర్‌ బాటిల్‌తో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో యువకుడి తలకు తీవ్ర గాయాలై గాయానికి సుమారు 20 కుట్లు...

జాతర సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడి ఘటనతో భక్తులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

గాయపడిన యువకుడు ఘటనపై రేణిగుంట అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం . ఘర్షణకు దారితీసిన కారణాలు ఏమిటి? దాడిలో ఎంతమంది పాల్గొన్నారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story