Renigunta: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: కూటమి ప్రభుత్వ ఘనత!

Renigunta: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని తిరుపతి జిల్లా రేణిగుంటలో క్లస్టర్ ఇన్‌చార్జ్ డి.పుష్పనాధన్ పేర్కొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 11 Aug 2026 5:08 PM IST
Renigunta
X

Renigunta: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: కూటమి ప్రభుత్వ ఘనత!

రేణిగుంట: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం అభినందనీయమని క్లస్టర్ ఇన్‌చార్జ్ డి. పుష్పనాధన్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా,సామాజికంగా మరింత సాధికారత సాధించేందుకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. రోజువారీ ప్రయాణాలు.

ఉద్యోగాలు,విద్య,వైద్యం తదితర అవసరాల కోసం బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఈ పథకం ఆర్థిక భారాన్ని తగ్గిస్తోందన్నారు.కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని డి. పుష్పనాధన్ పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కుటుంబాలపై ప్రయాణ ఖర్చుల భారం తగ్గడంతో పాటు మహిళలకు స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం కలుగుతోందన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కుటుంబ సభ్యులు సాగర్,నవాబ్,అంబి,మేరీ,జగదీష్,గౌస్,ఏలుమలై,దినేష్ సుధా,కన్నా రెడ్డి,రవి,సుమన్,సుజాత తదితరులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story