Tirupati: ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్!

Tirupati: తిరుపతిలోని ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు పరిశీలించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 4 Nov 2026 2:33 PM IST
Tirupati
X

Tirupati: ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్!

Tirupati: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తిరుపతిలోని ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన సామాగ్రి పంపిణీ ప్రక్రియను, అధికారుల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA