Srikalahasti: నంది హిల్స్‌లో అయ్యప్ప ఆలయ నిర్మాణం చైర్మన్ కొట్టే సాయి

Srikalahasti: శ్రీకాళహస్తి నంది హిల్స్ ప్రాంతంలో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి అనుమతులు కోరుతూ కమిటీ సభ్యులు మధు గురుస్వామి ఆధ్వర్యంలో దేవస్థానం

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 21 May 2026 1:43 PM IST
Srikalahasti
X

Srikalahasti: నంది హిల్స్‌లో అయ్యప్ప ఆలయ నిర్మాణం చైర్మన్ కొట్టే సాయి

శ్రీకాళహస్తి: నంది హిల్స్ ప్రాంతంలో అయ్యప్ప స్వామి వారి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు సంబంధించి, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ , దేవస్థానం ఈవో వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అనుమతి కోసం రిక్విజిషన్ లెటర్లు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మరియు ఈవో వెంకటేశ్వర్లు ఆలయ నిర్మాణ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. త్వరలోనే తదుపరి చర్యలు చేపట్టి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ సభ్యులు:

అధ్యక్షులు: మధు గురుస్వామి, జీవి అమర్నాథ్.

సెక్రటరీలు: మురళి గురుస్వామి, కృష్ణ సురేంద్ర, డి.మురళి, రాజేష్.

ట్రెజరర్: సుధాకర్ గురుస్వామి అయ్యప్ప భక్తుల ఆధ్యాత్మిక ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ఈ ఆలయ నిర్మాణం కీలకంగా నిలుస్తుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story