Chandragiri: స్కూల్ పక్కనే మురికి నీటి గుంతలు.. పట్టించుకోని అధికారులు!
Chandragiri: తిరుపతి రూరల్ మండలం కాలూరు గ్రామంలో ఆర్‌ఓ ప్లాంట్ దుస్థితి.
Chandragiri: స్కూల్ పక్కనే మురికి నీటి గుంతలు.. పట్టించుకోని అధికారులు!
చంద్రగిరి: అసలే వేసవికాలం.. ఎండలు విపరీతంగా ఉన్నాయి... డయేరియా వంటి రోగాలు ప్రబలే అవకాశం ఉన్నాయి. పారిశుద్ధ్యం గ్రామాల్లో లోపిస్తే చర్యలు తప్పు... పారిశుధ్యం పై అధికారులు అప్రమత్తంగా ఉండాలి... అంటూ జిల్లా కలెక్టర్ డిపిఓ చెప్పుతూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఈ నిబంధనలు వర్తించడం లేదు. పారిశుధ్యం లోపించిన పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు అంటు రోగాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు.
తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం సి మల్లవరం గ్రామపంచాయతీ పరిధిలోని కాలూరు గ్రామంలో ప్రజలకు పారిశుద్ధి నీరు అందించేందుకు ఓ ప్రైవేట్ సంస్థ ఆర్వో ప్లాంట్ ను ఏర్పాటు చేసి మెయింటినెన్స్ బాధ్యతను పంచాయతీగా అప్పగించింది. అయితే పంచాయితీ అధికారులు ఆరో ప్లాంట్ వైపు కన్నెత్త కూడా చూడడం లేదు. ఈ ఆర్వో ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా పారిశుధ్యం లోపించింది. పాచిపెట్టిన ట్యాంకుతో నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రశ్నించే అధికారి కరువయ్యాడు.
లోపించిన పారిశుధ్యం....
తిరుపతి రూరల్ మండలం సి మల్లవరం గ్రామపంచాయతీ కాలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ వద్ద పారిశుధ్యం పూర్తిగా లోపించింది. ఆర్ఓ ప్లాంట్ కు ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేశారు. ఆర్ వో ప్లాంట్ నందు వేస్ట్ మీరు వస్తూ ఉంటాయి. వృధాగా వచ్చే నీరు వల్ల ప్లాస్టిక్ వాటర్ ట్యాంకు బాగా పాచి పట్టింది. ట్యాంక్ చుట్టూ పాచి పట్టడంతో అలాగే ఆ ట్యాంకు నుండి ఆర్ వో వాటర్ ను ప్రజలకు సరఫర చేస్తున్నారు. దాన్ని ఆర్వో ప్లాంట్ ను నిర్వహించే ప్రైవేటు వ్యక్తి కూడా ఆ ట్యాంకును శుభ్రపరిచినట్లు దాఖలాలు కనబడడం లేదు. అధికారులు అటు కన్నెత్తి చూడలేదు.
ఆర్వో వాటర్ ప్లాంట్ ముందు మురికి నీటి గుంతలు
ఆరో ప్లాంట్ సమీపంలో మురికి నీటి గుంతలు ఉన్నాయి. ఆరో ప్లాంట్ నుంచి వచ్చే వేస్ట్ నీరు అక్కడే నిల్వ కావడంతో మురికి నీరు అంతా గుంతల గుంతలుగా మారాయి. వేస్ట్ వీటిని పంచాయతీ అధికారులు గానీ, వాటర్ ప్లాంట్ ను నిర్వహించే వ్యక్తిగాని ఇతర ప్రాంతానికి పైపుల ద్వారా పంపించాల్సిన అవసరం ఉంది. మురికి నీటి గుంతలు అక్కడే ఉండడం వలన పలు ఇబ్బందులు రావడంతో పాటు దుర్వాసన కూడా వస్తుది. ఇక్కడే ప్రాథమిక పాఠశాల అంగన్వాడి కేంద్రం కూడా ఉంది. నిత్యం పిల్లలు ఆడుతూ ఉంటారు. దోమలు ఉదృతంగా ఉన్నాయి. ఈ సమయాల్లో ఈ దోమల వలన పిల్లలకు అంటూ రాగాలు ఇతర జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిపై సంబంధిత అధికారులు స్పందించిన దాఖలాలు లేవు. గతంలో ఉన్న పంచాయతీ అధికారి త్వరలో పైపులైను వేసి నీటిని వంకలోకి తీసుకు వళ్తామని చెప్పారు, ఆ పని చేయలేదు. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం అక్కడ ప్రజల పాలిట పిల్లల పాలిట శాపంగా మారుతుంది.
ఇలా ఉంటే జబ్బులు రావా..
ఆర్వో వాటర్ ప్లాంట్ అంటే ప్రజలకు పరిశుద్ధ నీటిని అందించే ప్లాంట్ అని అర్థం... ఆర్వో ప్లాంట్ వద్ద పారిశుధ్యం లోపించడమే కాకుండా, వాటర్ ట్యాంకుకు పాచి పట్టిపోవడం, ప్లాంట్ సమీపంలో మురికి నీటి గుంతలు ఉండడంతో జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఉండడంతో జబ్బులకు మనమే పరిచయం చేసినట్లు ఉంది. ఆర్వో ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో కానీ, మురుకు నీటి గుంతలు ఉన్న ప్రాంతంలో గాని పంచాయతీ అధికారులు కనీసం బ్లీచింగ్ వేసిన దాఖలాలు కూడా లేవు. అసలు పంచాయితీ అధికారులే కనపడరు. ఇక్కడ ఏం జరిగినా తమకు సంబంధం లేదు అన్నట్లుగా పంచాయతీ అధికారులు వ్యవహరిస్తున్నారు.
పంచాయతీ ఆదాయానికి గండి..
కాలూరు లో ఉన్న ఆర్వో వాటర్ ప్లాంట్ ద్వారా సి మల్లవరం గ్రామపంచాయతీకి ప్రతినెల 5000 రూపాయలు ఆదాయం వచ్చేది. గత ఏడు సంవత్సరాల మునుపు పంచాయతీ సిబ్బంది ఒకరు ఈ వాటర్ ట్యాంక్ ను నిర్వహణ చేసే బాధ్యతలు ఉన్నాయి. ఆ ఉద్యోగి పంచాయతీకి ప్రతినెల 5000 రూపాయలు చెల్లిస్తూ, కరెంట్ బిల్లు వాటర్ ప్లాంట్ కు కావాల్సన అన్ని వస్తువులు, అతనే
సమకూర్చుకునేవారు. అయితే గత ఏడు సంవత్సరాలు మునుపు పంచాయతి అధికారులు అతని బాధ్యత గురించి తప్పించి ఓ ప్రైవేటు వ్యక్తికి ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అప్పటినుంచి ఇప్పటివరకు పంచాయతీకి ఒక రూపాయి కూడా ఆ ప్రైవేట్ వ్యక్తి చెల్లించిన దాఖలాలు లేవు. పంచాయతీ అధికారులు ఎందుకు నువ్వు పంచాయతీకి చెల్లించలేదు అని అడిగిన దాఖలాలు కూడా లేవు. దీంతో ఏడు సంవత్సరాలగా పంచాయతీకి ఏడు లక్షలు నష్టం వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి కాలూరు ఆర్వో వాటర్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో ప్లాంట్ వద్ద లోపించిన పారిశుధ్యం పై దృష్టి సారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే పంచాయతీ ఆదాయాన్ని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే పంచాయితీ అధికారులు ఎంతవరకు స్పందిస్తారు వేచి చూడాలి మరి.




