Sullurupeta: సూళ్లూరుపేటలో కేసు నేర నిరూపణ ప్రధాన నిందితుడికి జైలు శిక్ష, జరిమానా!
Sullurupeta: సూళ్లూరుపేటలో క్రైమ్ కేసులో నేరం నిరూపితమవ్వడంతో ప్రధాన నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా, మరో ఇద్దరికి జరిమానా విధిస్తూ జూనియర్ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చింది.
Sullurupeta: సూళ్లూరుపేటలో కేసు నేర నిరూపణ ప్రధాన నిందితుడికి జైలు శిక్ష, జరిమానా!
Sullurupeta: చట్టాన్ని ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ స్పష్టం చేసింది. సూళ్ళూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక క్రిమినల్ కేసులో నేరం నిరూపితం కావడంతో ప్రధాన నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా, మరో ఇద్దరు నిందితులకు జరిమానా విధిస్తూ సూళ్లూరుపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శ్రీమతి పి. సంయుక్త శుక్రవారం తీర్పు వెలువరించారు.
సూళ్ళూరుపేట ఎస్సై జి. అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎద్దాల కిరణ్‌కు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.1,450 జరిమానా విధించారు. కేసులోని ఇతర నిందితులు వెట్టి రాజేశ్వరి, కొమ్మాల సుజాతలకు చెరో రూ.200 చొప్పున కోర్టు జరిమానా విధించింది. దీంతో ముగ్గురు నిందితులకు కలిపి మొత్తం రూ.1,850 జరిమానా విధించినట్లయింది. ప్రాసిక్యూషన్ తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే.జే. ప్రకృతి కుమార్ వాదనలు వినిపించారు
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట డీఎస్పీ జి. చెంచుబాబు పర్యవేక్షణలో సూళ్లూరుపేట సీఐ ఎం. మురళీకృష్ణ, ఎస్సై జి. అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ శివ కేసు విచారణలో సమన్వయంతో పనిచేశారు. సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరచడం, సమన్లు సక్రమంగా అందేలా చూడటం ద్వారా నేర నిరూపణకు సహకరించారు.
ఈ కేసు విచారణలో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి న్యాయస్థానంలో నేరం నిరూపితమయ్యేలా కృషి చేసిన సీఐ, ఎస్సై, కోర్టు కానిస్టేబుల్ శివలను తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ప్రత్యేకంగా అభినందించారు. నేరాలకు పాల్పడేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు, కేసుల్లో నేర నిరూపణకు పోలీసు సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని ఆయన సూచించారు.




