Srikalahasti: వికృతమాల వాసుల సమస్యలపై ఎంఆర్ఓకు వినతి
Srikalahasti: వికృతమాల ప్రభుత్వ గృహాల వాసులకు రెసిడెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతూ ఏర్పేడు ఎంఆర్ఓకు సీపీఐ జిల్లా కార్యదర్శి పి. మురళి వినతిపత్రం అందజేశారు.
Srikalahasti: వికృతమాల వాసుల సమస్యలపై ఎంఆర్ఓకు వినతి
Srikalahasti: వికృతమాల పంచాయతీ పరిధిలో గల ప్రభుత్వ గృహాలలో నివసిస్తున్న నిరుపేదలకు రెసిడెన్సీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ రోజు ఏర్పేడు మండల రెవిన్యూ ఆఫీస్‌లో మండల రెవిన్యూ అధికారిని (MRO) సిపిఐ నాయకులు కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా MRO గారు సమస్యపై సానుకూలంగా స్పందించి, త్వరలోనే కాలనీని స్వయంగా సందర్శించి అక్కడ నివసిస్తున్న వారికి రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే విషయంపై సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి గారు ఎమ్మార్వో గారితో మాట్లాడి, కాలనీలో ఉన్న పలు సమస్యలను వివరించారు.
ప్రభుత్వం కేటాయించిన గృహాలలో ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్నప్పటికీ, ఇంకా రెసిడెన్సీ సర్టిఫికెట్లు లేకపోవడంతో ప్రజలు రేషన్ కార్డు, ఆధార్ వంటి పలు ప్రభుత్వ సేవలను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు.




