Renigunta: కలెక్టరేట్ ముట్టడి.. పేదలకు స్థలాలు ఇవ్వాల్సిందే

Renigunta: రేణిగుంట తూకివాకం సర్వే నెం. 30 లో ఇంటి స్థలాల కోసం కలెక్టరేట్ వద్ద సిపిఐ నిరసన.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 6 May 2026 8:15 PM IST
Renigunta
X

Renigunta: కలెక్టరేట్ ముట్టడి.. పేదలకు స్థలాలు ఇవ్వాల్సిందే

Renigunta: రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీలోని సర్వే నెంబర్ 30 లో పేదలకు అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని బుధవారం నుండి కలెక్టర్ కార్యాలయం వద్ద పేదలందరూ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా సర్వే నెంబర్ 30లో పేదలకు ఇంటి స్థలాలు పోరాటం చేశారని,అయితే ప్రభుత్వాలు మారుతున్న పేదలకు ఇంటి స్థలాలు మాత్రం ఇవ్వలేదని విమర్శించారు.

ప్రజలందరూ పోరాడుతా ఉంటే పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం అక్రమంగా ఈ స్థలాన్ని అమ్ముకోవడం జరిగిందన్నారు.దీన్ని వ్యతిరేకిస్తూ జరిగిన పోరాటం ఫలితంగానే అక్రమంగా నిర్మించిన ఇండ్లను ప్రస్తుత ప్రభుత్వం తొలగించిందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు ప్రస్తుత మంత్రి నారాలోకేష్ బాబు గతంలో జరిగిన పాదయాత్రలో భాగంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి పేదలకు అందరికీ ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.

ఆ హామిని నిలబెట్టుకోవాలని శ్రీ కాళహస్తి ఎమ్మెల్యేను కూడా కోరడం జరిగిందన్నారు. అయినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేని దానివల్ల ప్రజలందరూ నిరసన కార్యక్రమానికి పూనుకోవడం జరిగిందన్నారు. ప్రజలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చే అంతవరకు ఈ పోరాటాన్ని ఆంచలంచలుగా ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం పేదల పట్ల సానుకూలతతో సర్వే నెం.30లో ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమానికి సిపిఐ పార్టి రేణిగుంట మండల కార్యదర్శి వైయస్ మణి అధ్యక్షత వహించగా మహిళా సంఘం నాయకురాలు పూమణి, శారద, అజ్జమ్మ, గోవిందమ్మ, నాయకత్వం వహించగ, ఎస్ఎన్ పురం, గంగుంట, నేతాజీ కాలనీ, అంబేద్కర్ కాలనీ మహిళలు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story