Tirupati: పాంచాలి నర్‌లో ప్రమాదకరంగా మారిన కాలువ: ఆందోళనలో స్థానికులు!
Tirupati: తిరుపతి జిల్లా రేణిగుంటలో కాలువపై ఉన్న సిమెంట్ బండ విరిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Tirupati: పాంచాలి నర్‌లో ప్రమాదకరంగా మారిన కాలువ: ఆందోళనలో స్థానికులు!
Tirupati: రేణిగుంట పాంచాలి నగర్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో కాలువపై ఉన్న బండ విరిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బషీర్ హాస్పిటల్ ఎదురుగా కాళహస్తి రోడ్డుకు వెళ్లే సందులో కాలువపై ఉన్న సిమెంట్ బండ పగిలిపోయి ప్రమాదకరంగా మారింది.
కాలువ తెరిచి ఉండటంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే స్థానికులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు సమస్యను గమనించి కాలువపై బండను వెంటనే ఏర్పాటు చేసి, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.




