Renigunta: రోడ్డుపై వైద్య వ్యర్థాలు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణం అంబేద్కర్ విగ్రహం వద్ద నడిరోడ్డుపై ప్రైవేట్ ఆసుపత్రులు పారేసిన ప్రమాదకర బయోమెడికల్ వ్యర్థాలు.
Renigunta: రోడ్డుపై వైద్య వ్యర్థాలు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం
Renigunta: రేణిగుంట పట్టణం అంబేద్కర్ విగ్రహం వద్దరోడ్డు పై ప్రైవేట్ హాస్పిటల్‌కు చెందినట్లు భావిస్తున్న వాడిన ఇంజక్షన్లు, సిరంజీలు, ఐవి సెట్లు, మెడికల్ వ్యర్థాలను రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా పడేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు సంచరించే ప్రాంతంలోనే ఈ బయోమెడికల్ వ్యర్థాలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
వాడిన సూదులు, సిరంజీలు బయట పడేయడం వల్ల హెపటైటిస్-B, హెపటైటిస్-C, హెచ్ఐవీ వంటి ప్రమాదకర అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, చెత్త సేకరించే కార్మికులు, వీధి జంతువులకు గాయాలు అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బయోమెడికల్ వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించి శుద్ధి చేసిన తర్వాతే నిర్వీర్యం చేయాలి. అయితే కొందరు ప్రైవేట్ ఆసుపత్రులు నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




