Tiruchanur: పద్మావతి అమ్మవారికి 5 వేల డోజన్ల గాజుల వితరణ
Tiruchanur: వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారికి 5 వేల డోజన్ల గాజులు, పసుపు కుంకుమల వితరణ చేసిన షణ్ముగం దంపతులు. భక్తులకు పంపిణీ చేయనున్న టిటిడి.
Tiruchanur: పద్మావతి అమ్మవారికి 5 వేల డోజన్ల గాజుల వితరణ
తిరుచానూరు: వరలక్ష్మీవ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి తిరుపతికి చెందిన షణ్ముగం దంపతులు 5 వేల డోజన్ల గాజులు,10వేల పసుపు కంకణాలు, పసుపు కుంకుమ 10 వేల ప్యాకెట్స్ బుధవారం ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, తిరుమల డిప్యూటీ ఈవో లోకనాథం కు అందజేశారు.
వీటిని వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు గాజులు, పసుపు కంకణాలు, పసుపు కుంకుమ ప్యాకెట్లు అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, సురేష్ అర్చకులు బాబు స్వామి, ఇన్స్పెక్టర్లు లక్ష్మీకాంత్, మునస్వామి, చలపతి తదితరులు పాల్గొన్నారు.
Next Story




