Renigunta: గంగమ్మ జాతర నిర్వాహకులతో రేణిగుంట డీఎస్పీ సమీక్ష!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంటలో రాబోయే గంగమ్మ జాతర నిర్వహణ, పటిష్ట భద్రతపై ఎస్‌డీపీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వాహకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Renigunta: గంగమ్మ జాతర నిర్వాహకులతో రేణిగుంట డీఎస్పీ సమీక్ష!
రేణిగుంట: రాబోయే గంగమ్మ జాతరను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు రేణిగుంట పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రేణిగుంట ఎస్‌డీపీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గంగమ్మ జాతర నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
జాతర సందర్భంగా నిర్వహించే ఊరేగింపు, భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై నిర్వాహకులతో చర్చించారు. పోలీసులకు నిర్వాహకులు పూర్తిగా సహకరించాలని, జాతరను ప్రశాంతంగా నిర్వహించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రేణిగుంట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జయచంద్ర తదితర పోలీసు అధికారులు,గంగమ్మ జాతర నిర్వాహకులు పాల్గొన్నారు.
Next Story




