Renigunta: రేణిగుంట సమీపంలో రైలు నుంచి జారిపడి వృద్ధుడు మృతి!

Renigunta: రేణిగుంట పరిధిలో రైలు నుంచి జారిపడి సుమారు 75 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి ఆచూకీ కోసం రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 5 Oct 2026 1:53 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట సమీపంలో రైలు నుంచి జారిపడి వృద్ధుడు మృతి!

రేణిగుంట: రైలు ప్రయాణంలో ప్రమాదవశాత్తు జారిపడిన ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన రేణిగుంట పరిధిలో చోటుచేసుకుంది.

పూడి–రేణిగుంట రైల్వే స్టేషన్ల మధ్య, మైలాపూర్ ఫుడ్ కంపెనీ సమీపంలో రేణిగుంట వైపు దిగువకు వెళ్లే రైలు పట్టాల పక్కన సుమారు 75 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని రైలు బండి నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఆయన మృతి చెందినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

మృతుడి ఒంటిపై తెల్లని పంచ, తెలుపు రంగు ఫుల్‌హ్యాండ్ షర్ట్, తెల్లని కండువా ఉన్నాయి. మెడలో ఎరుపు రంగు దారం, రుద్రాక్ష ధరించి ఉన్నారు.

రైల్వే పట్టాల పక్కన ప్రాణాలు కోల్పోయి, ఎవరో తెలియని స్థితిలో పడి ఉన్న వృద్ధుడిని చూసిన స్థానికులు విషాదానికి గురయ్యారు. ఇంత వయసు వచ్చిన వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన కుటుంబ సభ్యులు ఎవరు? చివరి ప్రయాణం ఎక్కడికి? అనే ప్రశ్నలు కలచివేస్తున్నాయి.

మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా తమ కుటుంబ సభ్యుడు కనిపించడం లేదని భావిస్తున్న వారు సంబంధిత రేణిగుంట రైల్వే జీఆర్పీ ఎస్ ఐ మధుసూదన్ రావును సంప్రదించాలని కోరారు. మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA