Tirupati: దివ్యాంగుల సదరం స్లాట్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్!

Tirupat: స్థానిక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ దివ్యాంగుల సదరం స్లాట్ల జారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 26 Oct 2026 3:17 PM IST
Tirupati
X

Tirupati: దివ్యాంగుల సదరం స్లాట్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్!

Tirupati: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ, దివ్యాంగులకు వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు సదరం స్లాట్లను విడుదల చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అక్టోబర్ 24న ప్రభుత్వ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖకు లేఖ జారీ చేశారు. దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా, అర్హులైన వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు పొందేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అయితే, ఈ ప్రక్రియలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల ప్రతులను రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు పంపించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA