Naidupeta: నాయుడుపేటలో సరస్వతి మహావిద్యాలయ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ ఫెస్ట్!
Naidupeta: నాయుడుపేట సరస్వతి మహావిద్యాలయ పాఠశాలలో ఘనంగా ఇంగ్లీష్ ఫెస్ట్. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించడమే లక్ష్యమన్న హెడ్మాస్టర్ విజయ ప్రియ.
Naidupeta: నాయుడుపేటలో సరస్వతి మహావిద్యాలయ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ ఫెస్ట్!
Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేట లోని సరస్వతి మహా విద్యాలయ ప్రైవేట్ పాఠశాల లో ఇంగ్లీష్ ఫెస్ట్ కార్యక్రమమును ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆ పాఠశాల హెడ్మాస్టర్ విజయ ప్రియ హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆ పాఠశాల హెడ్మాస్టర్ విజయ ప్రియ మాట్లాడుతూ చిన్నతనం నుండి విద్యార్థులలో ఇటువంటి భయాలు అపోహలు కలగకుండా వారిలో కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెంచడానికి ఈ కార్యక్రమమును ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొనడం సంతోషించదగిన విషయమని విద్యార్థులు చిన్నతనంలోనే ఇంగ్లీష్ పై భయాందోళనకు గురికాకుండా ఈ ఇంగ్లీష్ ఫెస్ట్ కార్యక్రమమును గత కొద్ది సంవత్సరాలుగా నడుపుతున్నామని.
ఈ కార్యక్రమమును నడిపే సమయంలో మిగతా బయట స్కూల్లోనీ ప్రధానోపాధ్యాయులను ఉపాధ్యాయులను ఈ కార్యక్రమం కు ఆహ్వానించడం జరిగిందని ఈ కార్యక్రమమును చూసినవారు ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు అవసరమని అభినందించడం జరిగిందని కాకపోతే ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలలోనే కాకుండా మిగిలిన హైస్కూలు కాలేజీలలో కూడా ఈ కార్యక్రమమును ఏర్పాటు చేస్తే విద్యార్థులు వారి కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంచుకుంటూ రేపు ఉన్నత విద్యను అభ్యసించడానికి గాని ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెండుగా ఉండి వారికి అనేక విధాలుగా ఉపయోగపడుతుందని ఇలాంటి కార్యక్రమాలను మిగిలిన పాఠశాలలో కూడా ఏర్పాటు చేయాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.




