Naidupeta: జర్నలిస్ట్ కుటుంబానికి అండగా ఉంటాం కిలివేటి సంజీవయ్య హామీ!
Naidupeta: తిరుపతి జిల్లా మేనకూరుకు చెందిన జర్నలిస్ట్ కందాటి రజినీకాంత్ అకాల మరణం చెందారు.
Naidupeta: జర్నలిస్ట్ కుటుంబానికి అండగా ఉంటాం కిలివేటి సంజీవయ్య హామీ!
నాయుడుపేట: తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరుకు చెందిన జర్నలిస్ట్ కందాటి రజినీకాంత్ మరణించిన విషయం తెలుసుకున్న సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య మేనకూరులోని వారి స్వగృహానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
జర్నలిస్ట్ కందటి రజిని కాంత్ అకాల మృతి పై ఆయన దిగ్భ్రాంతిని తెలియపరిచారు, జర్నలిజంలో సేవలందించిన రజనీకాంత్ ఎంత చిన్న వయసులో మరణించడం ఎంతో బాధ కలిగిస్తుందని వారి కుటుంబానికి ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైన అండదండగా ఉంటానని రజనీకాంత్ కుటుంబ సభ్యులకు ఆయన తెలియపరచడం జరిగింది.
అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో నాయుడుపేట టౌన్ అధ్యక్షులు కలికి మాధవ రెడ్డి, జిల్లా రైతు విభాగం కార్యదర్శి కట్ట భవాని రెడ్డి,
ఓజిలి మండల అధ్యక్షులు పాదర్తి హరినాథ్ రెడ్డి, నాయుడుపేట రూరల్ అధ్యక్షులు కిషోర్ యాదవ్ , రాష్ట్ర కళాకారుల సాంస్కృతిక విభాగం నాయకులు కటకం జయరామయ్య గారు, శ్రీ బైనా మల్లికార్జున రెడ్డి గారు, శ్రీ పేట చంద్రారెడ్డి, రత్నశ్రీ, రాయపు శేఖర్, నెలవల రవి, వెంకటేశ్వర్లు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




