Thottambedu: మున్సిపల్ అధికారుల అరాచకం.. హైకోర్టు ఆర్డర్ ఉన్నా లెక్కలేదా?
Thottambedu: శ్రీకాళహస్తి మున్సిపాలిటీ అధికారులు తన సెటిల్మెంట్ భూమిని ఆక్రమించి గది నిర్మిస్తున్నారంటూ బాధితుడు పెరుమాళ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
Thottambedu: మున్సిపల్ అధికారుల అరాచకం.. హైకోర్టు ఆర్డర్ ఉన్నా లెక్కలేదా?
తొట్టంబేడు: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం తొట్టంబేడు గ్రామం సర్వే నెంబర్ 298/3 లో 1,78, సెంట్లు భూమిని పెరుమాళ్ రెడ్డి తండ్రి శ్రీనివాసులు రెడ్డి అనే నేను సెటిల్మెంట్ ల్యాండ్ ను 2016 సంవత్సరంలో తిరుపతి వాస్తవులు భవాని నగర్ రూప్ చంద్ తండ్రి శ్రీనివాసులు శెట్టి దగ్గర కొనుగోలు చేయడం జరిగింది.
శ్రీకాళహస్తి మున్సిపాలిటీ అధికారులు ఈ భూమి మాది అని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మాకు హైకోర్టు ఆర్డర్ ఉన్న లెక్కచేయకుండా మా సెటిల్మెంట్ ల్యాండ్ లో మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. నా సెటిల్మెంట్ ల్యాండ్ లో శ్రీకాళహస్తి మున్సిపల్ అధికారులు రూమ్ నిర్మాణం చేపడుతున్నారు.
నా సెటిల్మెంట్ ల్యాండ్ లో రూమ్ నిర్మిస్తున్నారు నిర్మించకూడదు అని చెప్పినా వినడం లేదు. హైకోర్టు పర్మినెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న శ్రీకాళహస్తి మున్సిపాలిటీ అధికారులు లెక్కచేయకుండా కోర్టు ఆర్డర్ ను ధిక్కరిస్తున్నారు. ఒకసారి విచారణ చేపట్టి మాకు తగు న్యాయం చేయవలసిందిగా అధికారులను కోరుతున్నామని తెలియజేశారు.




