Tirupati: త్వరితగతిన పరిష్కరిస్తాం.. చెరువు సమస్యపై కలెక్టర్ హామీ
Tirupati: వడమాలపేట మండలం ఎస్.బి.ఆర్ పురం గ్రామ చెరువు సమస్యపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లును కలిసిన రైతులు.
Tirupati: త్వరితగతిన పరిష్కరిస్తాం.. చెరువు సమస్యపై కలెక్టర్ హామీ
తిరుపతి జిల్లా: వడమాల పేట గ్రామ చెరువు సమస్య పై జిల్లా కలెక్టర్ ను కలిసిన రైతులు. గ్రామాన్ని రైతులను ఆదుకోండి - జిల్లా కలెక్టర్ కు వినతి సమర్పించిన రైతులు. వడమాల పేట మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఎస్.బి.ఆర్ పురం గ్రామ చెరువు సమస్య పై గురువారం రోజున తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ల ను గ్రామస్థులు రైతులు కలిశారు. అనంతరం గ్రామ చెరువు సమస్యల పట్ల ఆయనకు క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చెరువు సమస్య పట్ల ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు. జిల్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ రాజు, రాకేష్, రామచంద్ర రాజు, అయ్యప్ప, తదితరులు పాల్గొన్నారు.
Next Story




