Tirupati: తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు!
Tirupati: తిరుపతి రైల్వే స్టేషన్ పరిసరాల్లోని ఆహార కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Tirupati: తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు!
తిరుపతి: తిరుపతి రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉన్న ఫుడ్ సెంటర్లపై సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆర్. జగదీష్ శనివారం తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాల నాణ్యత, శుచి శుభ్రత, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు. తనిఖీల్లో పరిశుభ్రత ప్రమాణాలు సరిగా పాటించని పలు ఫుడ్ సెంటర్లపై కేసులు నమోదు చేశారు.
అలాగే Goldie Punjabi Dhaba, హేమంత్ ధాబా, మంజునాథ భవన్ నిర్వాహకులకు తాకీదులు జారీ చేయడంతో పాటు నిబంధనల ప్రకారం తగిన చర్యలు చేపట్టారు.ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా హోటళ్లు, ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు తప్పనిసరిగా ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనలు పాటించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచించారు.
Next Story




