Pellakuru: సత్యనారాయణ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

Pellakuru: తిరుపతి జిల్లా పెళ్లకూరులో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.

KKV Sudhakar, Sullurupeta
Published on: 23 Jun 2026 7:23 AM IST
Pellakuru
X

Pellakuru: సత్యనారాయణ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

తిరుపతి జిల్లా: సూళ్ళూరుపేట నియోజకవర్గం పెళ్లకూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి సోమవారం నాడు పరామర్శించారు. ఇటీవల బెయిల్పై విడుదలైన సత్యనారాయణ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

​ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే సత్యనారాయణ రెడ్డిపై అక్రమంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని తీవ్రంగా ఆరోపించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న ఇటువంటి అక్రమ కేసులను పార్టీ పరంగా దీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. సత్యనారాయణ రెడ్డి విడుదల పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

​ఈ పరామర్శ కార్యక్రమంలో సూళ్ళూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ విజయ్ కుమార్ రెడ్డిలతో పాటు పలువురు స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. జైలు నుంచి విడుదలైన సత్యనారాయణ రెడ్డిని కలిసి వారు తమ మద్దతును ప్రకటిస్తూ, శుభాకాంక్షలు తెలియజేశారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story