Naidupeta: ప్రతిపక్షాలపై అక్రమ కేసులు తగదు: మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య!
Naidupeta: ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించడం తగదని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆగ్రహం. సత్యనారాయణరెడ్డి అరెస్టుపై నాయుడుపేటలో ఎంపీ గురుమూర్తితో కలిసి మీడియా సమావేశం.
Naidupeta: ప్రతిపక్షాలపై అక్రమ కేసులు తగదు: మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య!
తిరుపతి: తిరుపతి జిల్లా నాయుడుపేట ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఈ సమావేశంలో పాల్గొని టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
పెళ్లకూరు మండలం చిల్లకూరులో జరిగిన ఘటనకు సంబంధించి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని అరెస్టు చేయడం కక్షసాధింపు చర్యేనని సంజీవయ్య ఆరోపించారు. ఘటనతో తో సంబంధం లేని వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారని, అయినప్పటికీ సత్యనారాయణరెడ్డిపై హత్య కేసు పెట్టారని విమర్శించారు.
అంతేకాకుండా కేసుతో సంబంధం లేని ఐదుగురిని అరెస్టు చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తిప్పుతూ వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో నిజానిజాలను అధికారులు, వైద్యులు స్పష్టంగా వెల్లడించాలని ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య డిమాండ్ చేశారు.
సూళ్లూరుపేట నియోజకవర్గంలో రేషన్ బియ్యం మట్టి గ్రావెల్ ఇసుక అక్రమ రవాణాపై కూడా టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని సంజీవయ్య డిమాండ్ చేశారు.




