Sullurpeta: సూళ్ళూరుపేటలో పారిశుధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం!

Sullurpeta: 'స్వచ్ఛత హీ సేవ-2026'లో భాగంగా తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 30 Sept 2026 4:11 PM IST
Sullurpeta
X

Sullurpeta: సూళ్ళూరుపేటలో పారిశుధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం!

Sullurpeta: ​స్వచ్ఛత హీ సేవ-2026 కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పురపాలక సంఘ పరిధిలో పారిశుధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు చేపడుతున్న నేపధ్యంలో సూళ్ళూరుపేట మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో మున్సిపల్ కమిషనర్ కె. చిన్నయ ఆధ్వర్యంలో ఈ విశేష శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

పట్టణ ప్రజలకు నిత్యం మెరుగైన, అత్యుత్తమ నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన సూళ్ళూరుపేట హన్విత స్పెషాలిటీ హాస్పిటల్ మరియు ప్రభుత్వ గాండ్ల వీధి అర్బన్ హెల్త్ క్లినిక్ సంయుక్త సౌజన్యంతో ఈ ప్రత్యేక ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా హన్విత స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ హరి ప్రకాష్, డాక్టర్ నవ్యత, గైనకాలజిస్ట్ డాక్టర్ తేజస్విని మాట్లాడుతూ పట్టణాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకు రాత్రింబవళ్ళు నిరంతరం కష్టపడి పనిచేసే పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రతే ప్రధాన ధ్యేయంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించడమే కాకుండా ఉచితంగా వైద్య సలహాలు, సూచనలు అందించారు. క్యాంప్‌లో భాగంగా కార్మికులందరికీ ఉచితంగా అన్ని రకాల రక్త పరీక్షలు, కంటి పరీక్షలు సమగ్రంగా నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని దాదాపు 150 మంది పారిశుధ్య కార్మికులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొని విజయవంతంగా వినియోగించుకున్నారు.

ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు యన్. పార్వతీ, టి. శంకర్, సచివాలయ పారిశుధ్య మరియు పర్యావరణ కార్యదర్శులు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, శానిటరీ మేస్త్రీలు, పారిశుధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta