Tirupati: పెట్రోల్ లేదు.. డీజిల్ లేదు రాష్ట్రంలో అల్లాడుతున్న వాహనదారులు!
Tirupati: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత. రాష్ట్రవ్యాప్తంగా బంకుల వద్ద బారులు తీరిన వాహనాలు.
Tirupati: పెట్రోల్ లేదు.. డీజిల్ లేదు రాష్ట్రంలో అల్లాడుతున్న వాహనదారులు!
తిరుపతి జిల్లా: రాష్ట్రంలోని పలుచోట్ల పెట్రోలు, డీజిల్ కొరత నెలకొనడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద ‘నో పెట్రోల్, డీజిల్’ బోర్డులు ఏర్పాటు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కొన్నిచోట్ల ఇంధనం పూర్తిగా అయిపోవడంతో బంకులు తాత్కాలికంగా మూతపడినట్లు సమాచారం. దీంతో వాహనదారులు అందుబాటులో ఉన్న బంకుల వద్ద భారీగా బారులు తీరుతూ గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంధనం కోసం పడుతున్న ఇబ్బందులపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెట్రోలు, డీజిల్ సరఫరా సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Next Story




