Tirupati: రేణిగుంట సంత సమీపంలో మహిళపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్ట్!
Tirupati: తిరుపతి జిల్లా గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణిగుంట సంత సమీపంలో జరిగిన మహిళపై హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు.
Tirupati: రేణిగుంట సంత సమీపంలో మహిళపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్ట్!
తిరుపతి: గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. క్రైమ్ నెం.104/2026లో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 109(1), 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రేణిగుంట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మంజునాథ రెడ్డి తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. రామకృష్ణాపురం గ్రామానికి చెందిన ఆర్. కుమార్ (44) అనే వ్యక్తి గతంలో తనతో సహజీవనం చేసిన మహిళ తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేయడంతో ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆగస్టు 1న రేణిగుంట సంత సమీపంలో ఆమెపై కత్తితో దాడి చేసినట్లు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతని ఒప్పుకోలు మేరకు దాడికి ఉపయోగించిన కత్తి,మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు పూర్తి చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు రిమాండ్‌కు తరలించింది.
ఈ కేసును వేగంగా ఛేదించిన గాజులమండ్యం సీఐ మంజునాధ రెడ్డి,ఎస్ ఐ హరీష వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.




