Tirupati: విప్పమనుపట్టెడలో సైబర్ నేరాలు, మహిళా భద్రతపై పోలీస్ అవగాహన సదస్సు!
Tirupati: తిరుపతి జిల్లా గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని విప్పమనుపట్టెడ గ్రామంలో సీఐ మంజునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
Tirupati: విప్పమనుపట్టెడలో సైబర్ నేరాలు, మహిళా భద్రతపై పోలీస్ అవగాహన సదస్సు!
తిరుపతి: గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని విప్పమనుపట్టెడ గ్రామంలో పోలీసు అధికారులు గ్రామస్తులతో సమావేశం నిర్వహించి సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, మహిళల భద్రతపై అవగాహన కల్పించారు.
ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకులు, అనుమానాస్పద యాప్‌లకు స్పందించవద్దని, OTPలు, బ్యాంకు ఖాతా వివరాలు, UPI PIN వంటి ఆర్థిక సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.
అలాగే యువత గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామంలో గంజాయి అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మహిళలు, బాలికల భద్రత కోసం శక్తి యాప్ వినియోగం, అందులో అందుబాటులో ఉన్న భద్రతా సేవలపై అవగాహన కల్పించారు. మహిళలు తమకు ఎదురయ్యే సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పోలీసులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ నేరాల నివారణలో పోలీసులతో కలిసి పనిచేయాలని కోరారు. “ప్రజల భద్రత – పోలీసుల బాధ్యత.. ప్రజల సహకారం – నేరాల నివారణకు బలం” అని పోలీసులు తెలిపారు.




