Gajulamandyam: గాజులమండ్యం పోగొట్టుకున్న బంగారు గొలుసు బాధితురాలికి అందజేత
Gajulamandyam: ఐదు నెలల క్రితం పోగొట్టుకున్న 8 గ్రాముల బంగారు గొలుసును సీసీటీవీ ఆధారంగా పట్టుకున్న గాజులమండ్యం పోలీసులు. పోలీసుల పనితీరుపై ప్రశంసల జల్లు.
Gajulamandyam: గాజులమండ్యం పోగొట్టుకున్న బంగారు గొలుసు బాధితురాలికి అందజేత
గాజుల మండ్యం: మహాశివరాత్రి రోజున పోగొట్టుకున్న 8 గ్రాముల బంగారు గొలుసును సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గుర్తించి బాధితురాలికి తిరిగి అప్పగించిన గాజులమండ్యం పోలీసుల పనితీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
రేణిగుంట మండలం వికలాంగుల కాలనీకి చెందిన రమీజా ఈ ఏడాది ఫిబ్రవరి 15న మహాశివరాత్రి సందర్భంగా గాజులమండ్యం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద తన 8 గ్రాముల బంగారు గొలుసును పోగొట్టుకుంది. అదే రోజు గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి,గొలుసును వెతికి ఇవ్వాలని పోలీసులను ఆశ్రయించింది.
ఫిర్యాదు మేరకు రేణిగుంట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. మంజునాథ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మహేంద్రబాబు, మణి సంఘటన స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. పరిశీలనలో కింద పడిన బంగారు గొలుసును ఓ వ్యక్తి తీసుకెళ్లినట్లు గుర్తించారు.
తదుపరి విచారణలో ఆ వ్యక్తి తిరుపతిలోని ఎస్‌వీ నగర్‌కు చెందిన ఏసుబాబుగా గుర్తించిన పోలీసులు, గురువారం అతడిని గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు.




