Tirupati: తిరుచానూరు శిల్పారామంలో ఘనంగా హస్తకళ మేళా ప్రారంభం!
Tirupati: తిరుచానూరు శిల్పారామంలో గాంధీ శిల్ప బజార్ హస్తకళల మేళా ప్రారంభం. ఎమ్మెల్యే పులివర్తి నాని, ఎంపీ ప్రసాద్ రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం.
Tirupati: తిరుచానూరు శిల్పారామంలో ఘనంగా హస్తకళ మేళా ప్రారంభం!
Tirupati: తిరుపతి శిల్పారామంలో గాంధీ శిల్ప బజార్ హస్తకళల మేళా చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గమల్ల ప్రసాద్ రావు, ఆంధ్ర ప్రదేశ్ హస్తకళ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ ప్రారంభించారు.
హస్తకళ కళాకారులు ఉత్పత్తులు కొనడం ద్వారా వారి ఆర్థికము ఆదుకోవటం, హస్తకళ అభివృద్ధి దోహదం చేస్తుంది అని వక్త పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవంలో స్టాళ్లు 40 మంది కళాకారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో హస్తకళ ఏ.డి. సత్యమూర్తి, తిరుపతి శిల్పారామం పరిపాలన అధికారి ఖదీర్ వల్లి, తిరుచానూరు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు, శిల్పారామం అధికారులు తదితరులు పాల్గొన్నారు.




