Tirumala: భారీ వర్షంలోనూ వైభవంగా తిరుమల శ్రీవారి గరుడసేవ!

Tirumala: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భారీ వర్షంలోనూ గరుడసేవ అత్యంత వైభవంగా ముగిసింది. సమిష్టి కృషితో వేడుకను విజయవంతం చేశామని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు.

Charan Kumar, Staff Reporter -Tirupathi
Updated on: 17 Oct 2026 8:41 AM IST
Tirumala
X

Tirumala: భారీ వర్షంలోనూ వైభవంగా తిరుమల శ్రీవారి గరుడసేవ!

Tirumala: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టమైన 'గరుడసేవ' శుక్రవారం రాత్రి వైభవంగా ముగిసింది. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, భక్తులు ఎక్కడా నిరుత్సాహపడకుండా అచంచల భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారుల సమన్వయం, సిబ్బంది, పోలీసు శాఖ మరియు శ్రీవారి సేవకుల సమిష్టి కృషితో ఈ వేడుక దిగ్విజయంగా పూర్తయినట్లు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు. గరుడసేవ ముగిసిన అనంతరం అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో కే.వీ.మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడులతో కలిసి ఈవో మీడియాతో మాట్లాడారు.

భక్తులకు అందని సేవలందించాం:

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో తెలిపారు. వర్షంలో తడుస్తున్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, బాదంపాలు, సుందలు, మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్లను నిరంతరం అందజేశామన్నారు.

“భక్తుల సేవే భగవంతుని సేవ” అనే నినాదంతో అంకితభావంతో పనిచేసిన టీటీడీ పాలకమండలి సభ్యులు, అధికారులు, విజిలెన్స్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, శ్రీవారి సేవకులు మరియు మీడియా ప్రతినిధులందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విద్యుత్ అలంకరణల ఏర్పాట్లు చేసిన ఎలక్ట్రికల్ శాఖ అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు.

భవిష్యత్తు కోసం శాశ్వత పరిష్కారాలు:

భవిష్యత్తులో ఇలాంటి వర్షాలు కురిసినప్పుడు భక్తులకు మరింత మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు శాశ్వత పరిష్కార మార్గాలతో కూడిన నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఈవో ముద్దాడ రవిచంద్ర స్పష్టం చేశారు.

Charan Kumar, Staff Reporter -Tirupathi

Charan Kumar, Staff Reporter -Tirupathi

11 ఏళ్లుగా ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోని ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.