Vadamalapet: గ్యాస్ డెలివరీ బాయ్ నుంచి ఎంపీటీసీగా ఎదిగిన భాస్కర్!
Vadamalapet: గ్యాస్ డెలివరీ బాయ్‌గా జీవనం సాగించిన ఎ. భాస్కర్ ఎమ్మెల్యే భాను ప్రకాష్ చొరవతో 164 ఓట్ల మెజారిటీతో గెలిచి గురువారం ఎస్‌బీఆర్ పురం ఎంపీటీసీగా ప్రమాణం చేశారు.
Vadamalapet: గ్యాస్ డెలివరీ బాయ్ నుంచి ఎంపీటీసీగా ఎదిగిన భాస్కర్!
వడమాలపేట: నిత్యం ఇంటింటికీ వెళ్లి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తూ, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న (మాదిగ) ఆది ఆంధ్రుడైన ఎ.భాస్కర్ ఎమ్మెల్యే భాను ప్రకాష్ చొరవతో ఇప్పుడు ఎంపీటీసీగా ఎన్నికయ్యారు.
వడమాలపేట మండలం ఎస్‌బీఆర్ పురం ఎంపీటీసీ విభాగం నుంచి కూటమి మద్దతుతో పోటీ చేసిన ఆయన 164 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.ఈ నేపథ్యంలో వడమాల పేట మండల ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీటీసీగా ప్రమాణ స్వీకారం చేశారు.
సామాన్య జీవితం గడిపిన తనకు ప్రజలు అందించిన ఆదరాభిమానాలే ఈ విజయానికి కారణమని భాస్కర్ పేర్కొన్నారు.గతంలో ఇంటింటికీ వెళ్లి గ్యాస్ సరఫరా చేసే క్రమంలో ప్రతి కుటుంబంలో ఎదుర్కొంటున్న సమస్యలను,ప్రజల కష్టాలను దగ్గరగా తెలుసుకునే అవకాశం కలిగిందన్నారు. తనపై నమ్మకంతో ఎంపీటీసీగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. ఎస్‌బీఆర్ పురం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.




