Tirupati: పీజీఆర్‌ఎస్ సేవలపై క్యూఆర్ కోడ్ ద్వారా ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి!
Tirupati: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) సేవలపై ప్రజలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ అభిప్రాయాలు, ఫీడ్‌బ్యాక్ తెలియజేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ కోరారు.
Tirupati: పీజీఆర్‌ఎస్ సేవలపై క్యూఆర్ కోడ్ ద్వారా ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి!
Tirupati: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.
పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో అర్జీదారులకు అందుతున్న సేవలు, వారి సమస్యల పరిష్కారంపై ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు, ఫీడ్‌బ్యాక్‌ను క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయవచ్చని తెలిపారు.
మొబైల్ ఫోన్‌లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన అనంతరం తెరుచుకునే పీజీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్ పేజీలో అవసరమైన వివరాలను నమోదు చేసి తమ అభిప్రాయాలను సమర్పించవచ్చన్నారు. ఈ విధానం ద్వారా ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలను సేకరించి, పీజీఆర్‌ఎస్ సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
కావున, జిల్లా ప్రజలు పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి సంబంధించి తమ అభిప్రాయాలు, సూచనలను క్యూఆర్ కోడ్ ద్వారా తెలియజేసి ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.




