Gollapalli: భక్తిశ్రద్ధలతో శ్రీ కావమ్మ దేవత 53వ ఉత్సవాలు

Gollapalli: శ్రీకాళహస్తి మండలం గొల్లపల్లి గ్రామంలో శ్రీ కావమ్మ దేవత 53వ అగ్నిగుండ ప్రవేశ మహోత్సవం వైభవంగా జరిగింది.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 4 May 2026 2:20 PM IST
Gollapalli
X

Gollapalli: భక్తిశ్రద్ధలతో శ్రీ కావమ్మ దేవత 53వ ఉత్సవాలు

Gollapalli: శ్రీకాళహస్తి మండలం, గొల్లపల్లి గ్రామం (బి.వి. పురం)లో వెలసిన శ్రీ కావమ్మ దేవత 53వ అగ్నిగుండ ప్రవేశ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో,వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.* ఈ కార్యక్రమానికి విచ్చేసిన అంజూరు శ్రీనివాసులుకు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కావమ్మ దేవతకు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

53 ఏళ్లుగా నిర్విఘ్నంగా జరుగుతున్న పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ వారు అంజూరు శ్రీనివాసులును అమ్మవారి శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామాల్లో ఇటువంటి ఉత్సవాలు నిర్వహించడం వల్ల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సంతోషాలతో ఉంటారు. నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు ఆలయ కమిటీని మరియు ముఖ్యంగా మునిబాబును అభినందించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story