Satyavedu: భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం.. సత్యవేడులో గంగమ్మ

Satyavedu: సత్యవేడులో ప్రసిద్ధ గంగమ్మ జాతర బుధ, గురువారాల్లో జరగనుంది.

K. SURESH BABU, SATYAVEDU
Published on: 13 May 2026 2:02 PM IST
Satyavedu
X

Satyavedu: భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం.. సత్యవేడులో గంగమ్మ

సత్యవేడు: సత్యవేడు మేజర్ పంచాయతీ పరిధిలో రెండు ప్రదేశాల్లో రెండు రోజులు గంగమ్మ జాతరలు జరుగుతాయి .సత్యవేడులో సదవాలమ్మ జాతర, దలవాయి అగ్రహారంలో చెల్లి అమ్మ జాతర్లు విడివిడిగా నిర్వహిస్తారు . సర్వమత సమ్మేళనం కు ప్రతీకగా, బుధ, గురువారాల్లో జాతరలు జరుగుతాయి పంచాయతీ ఒకటే అయినప్పటికీ.. జాతరలు ఆయా కుల పెద్దల సహకారంతో రాయలసీమకే తలమానికంగా ఇక్కడ జాతర జరగడం విశేషం.

సత్యవేడు గంగమ్మ దలవాయిఅగ్రహారం గ్రామదేవతను ఇక్కడ స్థానికులు అక్కాచెల్లెళ్లుగా కొలుస్తూ ఉంటారు. అందుకే తరతరాలుగా సత్యవేడు జాతర దలవాయి అగ్రహారం జాతర ఒకేసారి జరగడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నది.బుధవారం రాత్రి అమ్మవారి ఊరేగింపు, గురువారం అమ్మవారిని కొలువులో భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పిస్తారు. అదే రోజు అర్ధరాత్రి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది.

విశేషంగా జరిగే సత్యవేడు జాతరకు తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక సమీప ప్రాంతాల నుండి విశేషంగా ప్రజల విచ్చేసి సదవాలమ్మ (గంగమ్మ)కు మొక్కులు తీర్చుకొని అమ్మవారిని దర్శించుకుని వెళుతూ ఉంటారు. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం సత్యవేడు గంగమ్మ పై ఎనలేని నమ్మకం భక్తి ఈ ప్రాంత ప్రజలకు, ఎంతో ప్రాధాన్యత ఉంది అందుకే సుమారు లక్ష మంది పైన అమ్మవారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకొని వెళ్తూ ఉంటారు భక్తులు.

K. SURESH BABU, SATYAVEDU

K. SURESH BABU, SATYAVEDU

Next Story