Chandragiri: చంద్రగిరి పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో వైభవంగా పాసింగ్ అవుట్ పరేడ్!

Chandragiri: తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో 581 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ వైభవంగా జరిగింది.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 25 Sept 2026 7:41 PM IST
Chandragiri
X

Chandragiri: చంద్రగిరి పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో వైభవంగా పాసింగ్ అవుట్ పరేడ్!

Chandragiri: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఎస్‌సీటీపీసీ సివిల్ 2025 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పీటీసీ ప్రిన్సిపాల్ మహేష్ కుమార్ శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లతో ప్రతిజ్ఞ చేయించారు.

పోలీస్ శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే పులివర్తి నాని జ్ఞాపికలు అందజేశారు.ఈ సందర్భంగా నూతన కానిస్టేబుళ్లు కట్టుదిట్టమైన క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ, ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సమాజ సేవలో ముందుండాలని అతిథులు పిలుపునిచ్చారు. ప్రజలకు నమ్మకమైన పోలీసు సేవలు అందించాలని సూచించారు.581 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకుని పోలీస్ శాఖలో విధులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI