Tirupati: మైనర్ బాలికపై జీఎస్టీ అధికారి లైంగిక దాడి
Tirupati: తిరుపతిలో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో ఘోరం. జీఎస్టీ ఉద్యోగితో పాటు నిందితుడికి సహకరించిన డిప్యూటీ తహసీల్దార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.
Tirupati: మైనర్ బాలికపై జీఎస్టీ అధికారి లైంగిక దాడి
Tirupati: తిరుపతి జిల్లాలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి జీఎస్టీ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రామ్మూర్తి (51) తన బంధువైన 16 ఏళ్ల బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలితో తీసుకున్న ఫోటోలు, చాట్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో తెలంగాణలో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా, అనంతరం కేసు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడికి సహకరించిన బాధితురాలి పిన్ని మానస (డిప్యూటీ తహసీల్దార్)ను కూడా అరెస్ట్ చేశారు.
ఇద్దరినీ కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మైనర్ బాలలపై నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.




